మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

 మృతుని కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం..

బిఆర్ఎస్ పార్టీ నాయకులు, వెల్దండ మాజీ సింగల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు..

కల్వకుర్తి రూరల్, డిసెంబరు 30 (మనఊరు ప్రతినిధి): చారకొండ మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన కందుకూరి వెంకటయ్య మృతి చెందడంతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సింగల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు ఆర్థిక సహాయం అందించారు, కందుకూరి వెంకటయ్య మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ సహచరుల ద్వారా తెలుసుకున్న జూపల్లి భాస్కర్ రావు వెంటనే రూ పదివేలను వెంకటయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. జూపల్లి భాస్కర్ రావు యువసేన సభ్యులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికైనా ఏ ఆపద వచ్చిన వెంటనే ఆదుకునే వ్యక్తి జూపల్లి భాస్కర్ రావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జూపల్లి సర్పంచ్ అనూష జగపతి, బిఆర్ఎస్ మండల నాయకులు అప్పల శేఖర్ గౌడ్, భాస్కర్ రావు యువసేన సభ్యులు ఎండి సిరాజ్, సత్యం యాదవ్,శివ యాదవ్ చంద్రాయన్ పల్లి బిఆర్ఎస్ నాయకుల తదితరులు ఉన్నారు.

Previous Post Next Post