ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

 మరికల్‌లో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

రామాలయంలో ప్రత్యేక పూజలు – ఉత్తర ద్వారం గుండా భక్తుల దర్శనం

చౌడపూర్, డిసెంబరు 30 (మనఊరు ప్రతినిధి): చౌడపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు, సీతా సమేత శ్రీ రాముల వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పురోహితులు కృష్ణమోహన్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరియాలని స్వామివారు ఆశీర్వదించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఉత్తర ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శన అవకాశాన్ని కల్పించగా, ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.



Previous Post Next Post