గౌతపూర్‌లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

 గౌతపూర్‌లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

 ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని ఆహ్వానించిన ఆధ్యాత్మిక జ్ఞాని శ్రీశ్రీశ్రీ హరి బాలానంద దాసు

 బాలానగర్, డిసెంబర్ 29 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని గౌతపూర్ గ్రామంలో శ్రీ విజయ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక జ్ఞాని శ్రీశ్రీశ్రీ హరి బాలానంద దాసు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలలో భాగంగా డిసెంబర్ 29, సోమవారం ఉదయం 5 గంటలకు సహస్ర పాల పాత్ర పుష్కలాభిషేకం, ఉదయం 11 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి సహస్రనామ జప యజ్ఞం, మధ్యాహ్నం 1:30 గంటలకు అన్నదానం, మధ్యాహ్నం 3 గంటలకు గరుడ వాహన సేవ, రాత్రి 8 గంటలకు భజన కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే డిసెంబర్ 30, మంగళవారం ఉదయం 5 గంటలకు అభిషేకం, ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణం, మధ్యాహ్నం 1:30 గంటలకు అన్నదానం, రాత్రి 8 గంటలకు రథోత్సవం ఘనంగా జరుగనున్నట్లు తెలిపారు. ఈ ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు ముఖ్య అతిథిగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారిని ఆహ్వానించినట్లు గోపులాపూర్ మాజీ సర్పంచ్ టి. చెన్నయ్య, బాలానగర్ మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముక్కోటి ఏకాదశి వేడుకలను విజయవంతం చేయాలని బాలానగర్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జడ్చర్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జడ్చర్ల మండలంలోని గోపులాపూర్ మాజీ సర్పంచ్ టి. చెన్నయ్య కోరారు.

Previous Post Next Post