నల్లమల గిరిజనుల గడపలోకి జాగృతి జనంబాట

 నల్లమల గిరిజనుల గడపలోకి జాగృతి జనంబాట

చెంచుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కల్వకుంట్ల కవిత

అచ్చంపేట, (మనఊరు ప్రతినిధి): జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అచ్చంపేట నియోజకవర్గంలోని అప్పాపూర్ చెంచు పెంటను సందర్శించారు. ఈ సందర్భంగా చెంచు పెంటలోని గిరిజనుల నివాసాలకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో చెంచులు అనుసరిస్తున్న జీవన విధానం, నిత్యావసరాలు, అలాగే అత్యవసర సమయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై కవిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం, రవాణా, తాగునీరు, విద్య వంటి మౌలిక వసతుల విషయంలో చెంచులు పడుతున్న కష్టాలను ఆమెకు గిరిజనులు వివరించారు. 

ఈ సందర్భంగా చెంచు కుటుంబాలకు నూతన వస్త్రాలు అందజేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, ముఖ్యంగా చెంచుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా తగిన చర్యలు తీసుకుంటానని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, అడవుల్లో నివసిస్తున్న చెంచులకు అన్ని మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. కవిత పర్యటనతో చెంచు పెంటలో ఉత్సాహం నెలకొంది.










Previous Post Next Post