పదవీరమణ పది ఏళ్ళు పూర్తి చేసుకున్న రాంసింగ్

 రామ్‌సింగ్ పదవీ విరమణకు పదేళ్లు పూర్తి

 – సేవలకు కృతజ్ఞతలతో శుభాకాంక్షలు

ఖిల్లా ఘనపూర్, డిసెంబరు 31 (మనఊరు ప్రతినిధి): మన రామ్‌సింగ్ సర్ పదవీ విరమణ చేసి నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. విద్యా రంగంలో ఆయన అందించిన సేవలు, నిబద్ధత, క్రమశిక్షణ ఇప్పటికీ అనేకమందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఉపాధ్యాయుడిగా, మార్గదర్శకుడిగా విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషి అమోఘమని పలువురు కొనియాడుతున్నారు.

పదవీ విరమణ అనంతరం కూడా విద్య, సమాజ సేవల పట్ల ఆయన చూపిన ఆసక్తి ప్రశంసనీయం. ఈ సందర్భంగా రామ్‌సింగ్ సర్‌కు శిష్యులు, సహచరులు, అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గాడ్ బ్లెస్ యూ రామ్‌సింగ్ సర్ అంటూ పలువురు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

Previous Post Next Post