ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా సత్తేశ్వర అనాధ ఆశ్రమంలో అన్నదానం
చర్లపల్లి సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ సేవాభావం
జడ్చర్ల రూరల్, డిసెంబర్ 31 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం సత్తేశ్వర సేవ ఆశ్రమంలో మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని చర్లపల్లి గ్రామ సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న వారికి భోజనం ఏర్పాటు చేసి మానవతా దృక్పథంతో సేవలు అందించారు. ఎమ్మెల్యే జన్మదినాన్ని ఇలా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు సమాజ సేవలో ముందుండాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తనూరు ఈశ్వర్ రామకృష్ణ సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ప్రవీణ్ చందర్, అనిల్ గౌడ్, నరేందర్ గౌడ్, జంగిలయ్య, తిరుపతయ్య తేజ, కోనేటి శివ ప్రసాద్, శ్రీనివాసులు, సాయిలు, నందు, కిట్టు, చర్లపల్లి గ్రామస్థులు, నసురుల్లాబాద్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

