సమస్యలకు నిలయంగా గుర్రం గుట్ట కాలనీ
రాజకీయాలకు అతీతంగా ఆమనగల్లును అభివృద్ధి చేద్దాం
బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు డాక్టర్ పత్య నాయక్ పిలుపు
ఆమనగల్లు, డిసెంబరు 27 (మనఊరు ప్రతినిధి): బీఆర్ఎస్ పార్టీ బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా ఆమనగల్లు మున్సిపాలిటీ 06వ వార్డు గుర్రం గుట్ట కాలనీలో మున్సిపాలిటీ అధ్యక్షుడు, గిరిజన సంఘాల రాష్ట్ర నాయకులు డా. పత్య నాయక్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పర్యటించారు. కాలనీలోని పురవీధుల గుండా తిరుగుతూ స్థానికులను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డా. పత్య నాయక్ మాట్లాడుతూ గుర్రం గుట్ట కాలనీ అనేక మౌలిక వసతుల సమస్యలతో బాధపడుతోందని తెలిపారు. కాలనీ సమస్యలు పరిష్కారమవ్వాలన్నా, ఆమనగల్లు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి చెందాలన్నా బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
గతంలో కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్‌కు, అనంతరం బీజేపీ పాలకవర్గానికి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే, మున్సిపాలిటీలోని అన్ని వార్డుల సమస్యలను పరిష్కరించి ఆమనగల్లును అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా పట్టణాభివృద్ధే తమ లక్ష్యమని అన్నారు.
ఈ బస్తీ బాట కార్యక్రమంలో
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంగళి రఘు, ఏనుముల రమేష్, యూత్ విభాగం ఇన్‌చార్జ్ అధ్యక్షులు వడ్డే వెంకటేష్, వరికుప్పల గణేష్, కొమ్ము ప్రసాద్, తోట కృష్ణ యాదవ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ రమేష్ నాయక్, ఎస్టీ సెల్ అధ్యక్షులు రమేష్ నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు లండం యాదయ్య, వడ్డేమాన్ శివకుమార్, నిరంజన్, చంద్ పాషా, జంతుక కిరణ్, మహేష్ నేత, శివ, లలితమ్మ, విమలమ్మ, అమృతమ్మ, వెంకటమ్మ, రాములు, శంకర్ నాయక్, గోపి, జంగయ్య, గణేష్ నాయక్, ఆంజనేయులు, గిరి, శ్రీకాంత్ నాయక్, సుగుణమ్మ, భాగ్యమ్మ, అలివేలు, అండాలు, ఈదమ్మతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

















