అభివృద్ధికి ఆమడ దూరంలో పురాతన శివాలయం

 అభివృద్ధికి ఆమడ దూరంలో పురాతన శివాలయం

పట్టించుకోని అధికారులు… 

శిథిలావస్థలో చారిత్రక దేవస్థానం

కల్వకుర్తి, డిసెంబరు 5 (మనఊరు ప్రతినిధి): దక్షిణ భారతదేశ చరిత్రలో క్రీ.శ. 742వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఆలయ నిర్మాణాల్లో కల్వకుర్తి ప్రాంతం కూడా ప్రధాన స్థానం దక్కించుకుంది. గద్వాల, అలంపూర్, కొల్లాపూర్, కోయిలకొండ, అన్నసాగర్‌లతో పాటు కల్వకుర్తి పరిసరాల్లో అనేక పురాతన ఆలయాలు నిర్మించబడ్డాయి. వాటిలో భాగంగా వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో ఉన్న దక్షిణకాశీగా పేరు పొందిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచింది. అక్కడ గల గుండంలో బెత్తం వేస్తే అది కాశీలో తేలుతుందనే పురాతన పురాణగాథ ఇప్పటికీ భక్తులను ఆకర్షిస్తోంది. మండలంలోని రఘుపతిపేట రామగిరిలో శ్రీరామాలయం, కల్వకుర్తిలో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం, కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేట రామగిరిలో ఉన్న శ్రీరామచంద్రస్వామి దేవస్థానం, అలాగే శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాలు చారిత్రక ప్రాధాన్యమున్నవి. కల్వకుర్తి పట్టణంలో ఉన్న పురాతన శ్రీ శివాలయం ఒకప్పుడు గ్రామ ప్రజల ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిగింది.

శివాలయం ఉన్న ప్రదేశం, తూర్పున గ్రామపంచాయతీ కార్యాలయం వెలుతున్న మార్గంలో శ్రీ వీరబద్రారస్వామి గుడి, ఉత్తరాన  కరెంట్ ఆఫీస్, ఆర్టీసీ బస్టాండ్ పడమర అబ్దుల్ ఖాదర్ వ్యవసాయ భూమి దక్షిణాన సుల్తాన్ వ్యవసాయ భూమి, దక్షణా భాగంలో కజ్జలపాపమ్మ, గుడి ఎదురుగా  1972 వరకు పూజలు… తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం 1972 వరకు శ్రీ శివరాంమూర్తి స్వామి ఆధ్వర్యంలో హోమాలు, పూజలు, యజ్ఞాలు, రథోత్సవాలు, అన్నదానాలు, దైవభక్తి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కానీ తర్వాత కాలంలో పరిసర ప్రాంతాలు హరిజనవాడ, దళిత శ్మశానవాటికలుగా మారడంతో ఆలయం దినదినాభివృద్ధి దూరమైపోయింది. పురాతన దేవస్థానాల జాబితాలో చోటు దక్కని శివాలయం దళితవాడ మధ్యలో ఉండటం వల్ల ఈ చారిత్రక ఆలయాన్ని పురాతన దేవస్థాన కమిటీలో నమోదు చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైవేద్యాలు, దీపారాధన నిలిచిపోయి ఆలయం శిథిలావస్థకు చేరింది. తెలివి, ప్రతిభ ఉన్నవారు చాలామంది కానీ శివాలయానికి చేయూత మాత్రం లేదు. ఈ ప్రాంతం నుండి విద్యావంతులు, పూజారులు, మేధావులు, కవులు, కళాకారులు, రంగస్థల నటులు, రాజకీయ నాయకులు ఎంతోమంది వెలుగుచూశా, శివాలయ పునర్నిర్మాణానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదని ప్రజలు పేర్కొంటున్నారు.












Previous Post Next Post