ఎల్లికట్ట గ్రామ ప్రజల దాహార్తిని తీర్చిన ఉప్పల వెంకటేష్
సొంత నిధులతో మోటర్ కొనిచ్చి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
కల్వకుర్తి, డిసెంబరు 29 (మనఊరు ప్రతినిధి): మండలంలోని ఎల్లికట్ట గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ స్పందించి గ్రామ ప్రజల దాహార్తిని తీర్చారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామ సర్పంచ్ ఉప్పల వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన సమకూర్చిన డబ్బులతో కొత్త మోటర్ కొనిచ్చి నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో గ్రామ ప్రజలు ఊరట పొందారు. గ్రామానికి అండగా నిలబడి సమస్యను తక్షణమే పరిష్కరించినందుకు గ్రామ సర్పంచ్ సుమిత్ర భీమయ్య, ఉపసర్పంచ్ కేశవులుతో పాటు గ్రామ ప్రజలు ఉప్పల వెంకటేష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆయన చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజు, రవి, ఆంజనేయులు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


