నేడు శ్రీ అరవింద కేంద్రంలో సామూహిక ధ్యానం

 నేడు శ్రీ అరవింద కేంద్రంలో సామూహిక ధ్యానం

నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం

సూర్యాపేట, డిసెంబరు 30 (మపఊరు ప్రతినిధి): నూతన సంవత్సరం పురస్కరించుకొని గురువారం ఉదయం 10.17 గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో ఉన్న శ్రీ అరవింద కేంద్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ధ్యాన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టణ పౌరులు, మహిళలు, శ్రీ మాత అరవింద భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఆధ్యాత్మిక చింతన, మనశ్శాంతి, సానుకూల ఆలోచనలతో నూతన సంవత్సరానికి ఆరంభం కావాలని లక్ష్యంగా ఈ సామూహిక ధ్యానాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Previous Post Next Post