సర్పంచ్ గా అవకాశమివ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
మిడ్జిల్ సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల శంకర్
మిడ్జిల్, డిసెంబరు 8 (మనఊరు ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచిగా అవకాశం ఇస్తే మిడ్జిల్‌ను అభివృద్ధి చేసి చూపిస్తానని మిడ్జిల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల శంకర్ అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్దే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని ఆయన అన్నారు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రస్తుత పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో ప్రజలకు అధిక నిధులు తీసుకొచ్చి ఆదర్శ గ్రామాలు తీర్చి దిద్దుతానని ఆయన చెప్పారు, సిసి రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెడతానని ఆయన వివరించారు. ప్రజలకు తమపై నమ్మకం ఉందని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి అంటే ఎంతో చేసి చూపిస్తానని ఎడ్లశంకర్ పేర్కొన్నారు.

