భక్తిశ్రద్ధలతో లలిత సహస్ర పారాయణ పఠనం...
నాగర్ కర్నూల్, డిసెంబరు 5 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రం సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తాలో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో శుక్రవారం నాడు లలితా సహస్ర పారాయణ పఠనం భక్తిశ్రద్ధలతో జ్ఞాన సరస్వతి పారాయణ కమిటీ సభ్యులు నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు నవీన్ కుమార్ శర్మ తెలిపారు. భక్తులు సామూహికంగా లలితా సహస్ర పారాయణ పఠనం, మణిద్వీప వర్ణన, లింగాష్టకం, సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలతో పాటు నిత్య అన్న ప్రసాద శాలలో సామూహిక భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
.jpg)
.jpg)
.jpg)



