గోవింద క్షేత్రానికి 20తులాల వెండి ఆభరణాలు అందజేత...

 గోవింద క్షేత్రానికి 20తులాల వెండి ఆభరణాలు అందజేత...

ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంతాచార్యులు

నాగర్ కర్నూలు, జనవరి 7 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం (గోవింద క్షేత్రం) నకు ధనుర్మాసంలో నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన బైసాని సత్యనారాయణ, రమాదేవి దంపతులు 20 తులాల వెండి ఆభరణాలు బుధవారం నాడు ఆలయ కమిటీ సభ్యులకు అందజేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ ఆచార్యులు తెలిపారు. ఆలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల,లక్ష్మణ హనుమాన్,ఉత్సవ విగ్రహాలకు 20 తులాల వెండి కిరీటాలు చేయించి అందజేశారని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.స్వామి అమ్మవార్ల కృపాకటాక్షాలు ఎల్లవేళలా వారిపై ఉండాలని వేద ఆశీర్వచనం బైసాని సత్యనారాయణ రమాదేవి దంపతులకు చేసి ప్రత్యేక తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సి.రమణ కుమార్,ప్రశాంత్ రెడ్డి, సుధీర్,గాజుల సురేష్, దయాకర్ రెడ్డి,దశరథం, ప్రసాద్ భక్తులు మహిళలు పాల్గొన్నారు.

 





Previous Post Next Post