దాతృత్వం చాటుకున్న నర్సింగ్ అధికారి ఉమా దేవి...

 ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి ఆరోగ్య పరికారాల అందజేత.....

దాతృత్వం చాటుకున్న నర్సింగ్ అధికారి ఉమా దేవి...

జి.జి.హెచ్.డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్

నాగర్ కర్నూల్, జనవరి 7 (మనఊరు ప్రతినిధి); జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ అధికారి ఏ.ఉమాదేవి పలు వార్డులకు రోగుల కొరకు నిత్య ఆరోగ్య సేవలకు అవసరమైన ఆరోగ్య పరికారాలను బుధవారం నాడు అందజేసి దాతృత్వం చాటుకున్నదని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్ అన్నారు. ప్రతిరోజు గర్భిణీలకు అవసరమైన డాప్లర్ మెషీన్ పరికరం గైనిక్ వార్డుకు అందజేశారు. నవజాత శిశువులకు, చిన్నారులకు అవసరమైన ఇన్ఫాంట్ వేయిన్ ఐడెంటిఫైడ్ మిషన్ పి.ఐ. సి.యు.వార్డుకు మరియు ఆర్థోపెడిక్ వార్డుకు నిత్యం అవసరమైన సిల్వర్ వాకర్ స్టాండ్ ను నర్సింగ్ అధికారి ఏ.ఉమాదేవి అందజేసినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా పలువురు వైద్యులు,తోటి సిబ్బంది ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ సుప్రియ, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజేష్ గౌడ్, డాక్టర్ రాజు, నర్సింగ్ సూపర్డెంట్ మంజుల, హెడ్ నర్సులు పద్మ, అమృత, నిర్మల, నర్సింగ్ అధికారి ఎం.ఆనంద్ కుమార్, ఇతర నర్సింగ్ అధికారులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





Previous Post Next Post