ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి 4 అధునాతన బీపీ ఆపరేటర్ల అందజేత

 ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి 4 అధునాతన బీపీ ఆపరేటర్ల అందజేత

దాతృత్వం చాటుకున్న కార్యాలయ సూపర్డెంట్ ఎం. రవి

ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి. శేఖర్ సమక్షంలో పంపిణీ

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి నాలుగు ఆధునిక బీపీ ఆపరేటర్లు విరాళం

నాగర్‌కర్నూల్, జనవరి 27 (మన ఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్యాలయ సూపర్డెంట్ ఎం. రవి మంగళవారం నాడు రోగుల సేవార్థం నాలుగు ఆధునిక బీపీ ఆపరేటర్లను అందజేశారు. ఈ బీపీ ఆపరేటర్లను ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ వి. శేఖర్ కు అధికారికంగా అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, ప్రతిరోజూ సాధారణంగా రక్త ఒత్తిడి పరీక్షలకు ఉపయోగపడే అత్యాధునిక బీపీ ఆపరేటర్లను విరాళంగా అందజేయడం ద్వారా ఎం. రవి తన దాతృత్వం, సేవాతత్పరతను చాటుకున్నారు. అందజేసిన నాలుగు బీపీ ఆపరేటర్లను గైనకాలజీ, ఆర్థోపెడిక్, సాధారణ శస్త్రచికిత్స విభాగాలు, ఫిమేల్ జనరల్ వార్డులకు డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ వి. శేఖర్ పంపిణీ చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తూనే ప్రజారోగ్యానికి ఉపయోగపడే వస్తువులు అందజేస్తున్న ఎం. రవిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఉపసంచాలకులు సీజే వసంత్, పరిపాలన అధికారులు ఏ. రామచంద్రయ్య, కే. మహేశ్వర్, కార్యాలయ సూపర్డెంట్ మీర్ గాలిబ్ అలీ, నర్సింగ్ అధికారి ఎం. ఆనంద్, ఆసుపత్రి నర్సింగ్ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




Previous Post Next Post