జడ్చర్ల బస్టాండ్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జడ్చర్ల, జనవరి 26 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆవిర్భావంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాధాకృష్ణ రావు (రిటైర్డ్ లెక్చరర్) హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని తెలిపారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బస్టాండ్ ఎస్‌ఎం మాస్టర్ రవీంద్రనాథ్, కంట్రోలర్లు విజయ్ కుమార్, శివరాజు, శివరాములు, ఆర్టీసీ సెక్యూరిటీ గార్డ్ లింగంపేట నర్సింలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించారు. సెక్యూరిటీ గార్డ్ లింగంపేట నరసింహులు, నాగర్‌కర్నూల్ డిపోకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ శివరాములు విశిష్ట సేవలకు గాను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





