అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు

 అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు… 

కల్వకుర్తిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

కల్వకుర్తి, జనవరి 26 (మనఊరు ప్రతినిధి): 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌరస్తాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలను ఈ సందర్భంగా వక్తలు స్మరించారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 77 సంవత్సరాలు పూర్తయిన ఈ శుభ సందర్భంలో రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకటనల కనకా నిఖిల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించగా, రిపబ్లిక్ డే అనేది ప్రతి భారతీయుడు గర్వించదగిన దినమని పాల్గొన్నవారు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, స్వేచ్ఛలను సద్వినియోగం చేసుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.



Previous Post Next Post