జడ్చర్ల జర్నలిస్టుకు జాతీయ స్థాయి గౌరవం

 జడ్చర్ల జర్నలిస్టుకు జాతీయ స్థాయి గౌరవం

మహమ్మద్ సత్తార్ ఆశిక్‌కు ఏపీ జే అ

బ్దుల్ కలాం టాలెంట్ బెస్ట్ అవార్డు

జడ్చర్ల, జనవరి 25 (మనఊరు ప్రతినిధి): రోజనామా ఇత్మాద్ పత్రికకు చెందిన జడ్చర్ల ప్రతినిధి మహమ్మద్ సత్తార్ ఆశిక్ గారికి ఏపీ జే అబ్దుల్ కలాం టాలెంట్ బెస్ట్ అవార్డు – 2026 లభించింది. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం నేడు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఏపీ జే అబ్దుల్ కలాం రూరల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షురాలు సయ్యద్ షెరైన్ సుల్తానా గారు మహమ్మద్ సత్తార్ ఆశిక్‌కు అవార్డును అందజేశారు.శఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఖర్జ్ ఖాన్తో పాటు పలువురు రాజకీయ, సామాజిక, మీడియా రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకొస్తూ, నిజాయితీతో బాధ్యతాయుత జర్నలిజం చేస్తున్న మహమ్మద్ సత్తార్ ఆశిక్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అవార్డు స్వీకరించిన అనంతరం మహమ్మద్ సత్తార్ ఆశిక్ మాట్లాడుతూ, ఈ గౌరవం తనకు మరింత బాధ్యతతో ప్రజాసేవ చేయడానికి ప్రేరణనిస్తుందని తెలిపారు. ప్రజల గొంతుకగా నిలబడుతూ, నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకొస్తానని ఆయన అన్నారు.


Previous Post Next Post