మల్లాపూర్ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి వినతి

 మల్లాపూర్ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి వినతి

ఇందిరమ్మ ఇండ్లు, డ్రైనేజ్‌, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్‌పై హామీ

మిడ్జిల్, జనవరి 10 (మనఊరు ప్రతినిధి): మండలంలోని మల్లాపూర్ గ్రామ అభివృద్ధి కోసం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రముఖులు కలిసి వినతిపత్రం అందజేశారు. శనివారం జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామానికి సంబంధించిన పలు కీలక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మల్లాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, కల్లంకీ సీసీ వర్క్, మినీ బస్‌స్టాప్ ఏర్పాటు, మినరల్ వాటర్ ప్లాంట్, ఐమాక్స్ లైట్లు, చెన్నకేశవ స్వామి దేవాలయానికి కాంపౌండ్ వాల్, బీసీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, మల్లాపూర్ గ్రామ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొప్పుల బంగారి, సుకుమార్ రెడ్డి, చెందర్ రెడ్డి, అయ్యన్న గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కొప్పుల సైదులు, ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, బంగారి, మిడ్జిల్ మండల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కొప్పుల శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పుల శ్రీనివాస్‌తో పాటు గ్రామ విద్యావంతులు, వ్యవసాయదారులు, కులవృత్తుల వారు పాల్గొన్నారు. మల్లాపూర్ గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు వినతిపత్రం అందజేయడం సంతోషకరమని కాంగ్రెస్ కార్యకర్త కొప్పుల బంగారి తెలిపారు.

Previous Post Next Post