ఘనంగా ముగ్గుల పోటీలు

లిటిల్ రోజెస్ స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు

బిజినేపల్లి, జనవరి 10 (మనఊరు ప్రతినిధి):శసంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో శనివారం నాడు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థినులు తమ ప్రతిభను చాటుకున్నారు. లిటిల్ రోజెస్ హై స్కూల్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. చదువుతోపాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులు రాణించాలనే ఉద్దేశంతో అధ్యాపకుల ప్రోత్సాహంతో ఈ పోటీలు నిర్వహించగా, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా విద్యార్థినులు వేసిన రంగవల్లికలు అందరి దృష్టిని ఆకర్షించాయి. పోటాపోటీగా వేసిన ముగ్గులు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చాయి. ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన చందన, ఐశ్వర్య, నందిని, లావణ్య, ఆరాధ్య, కృష్ణవంశీ, లాస్యశ్రీ, హర్షితలను నిర్వాహకులు బహుమతులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాము, ఇన్‌చార్జి రాంప్రసాద్‌తో పాటు అధ్యాపక బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందిస్తాయని వారు తెలిపారు.

Previous Post Next Post