సదరం శిబిరాల నిర్వహణకు కార్యాలయ స్థల పరిశీలన
నాగర్‌కర్నూల్, జనవరి 5 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రం దివ్యాంగుల కోసం ప్రతినెల నిర్వహించే సదరం శిబిరాల నిర్వహణకు అవసరమైన కార్యాలయ భవన ప్రదర్శన సోమవారం నాడు అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ స్థల పరిశీలనలో అదనపు జిల్లా కలెక్టర్ దేవ సహాయం, గ్రామీణ జిల్లా అభివృద్ధి అధికారి ఓబులేష్, రాజ్ ఈ కేంచే విజయ్ కుమార్, ఆసుపత్రి అధికారులు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో సదరం శిబిరాలు గదులు, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలం, ఆసుపత్రి పరిస్థితిని అధికారులు పరిశీలించారు. అదేవిధంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలోని ఖాళీ స్థలాలు, గదులు కూడా సదరం శిబిరాల నిర్వహణకు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్న దానిపై సమీక్షించారు. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిబిరాలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి వైద్యశాల ఉపసంచాలకులు సీ.జే. వసంత్ కుమార్, కార్యాలయ సూపరింటెండెంట్ మిర్ గాలిబ్ అలీ, డీఆర్‌డీఓ అధికారి శ్రీనివాసులు కొనసాగుతున్నారు.

