10న ప్రజా ప్రతినిధులకు సన్మానం
ఈనెల 10న బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ
బిజినపల్లి, జనవరి 5 (మనఊరు ప్రతినిధి): ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిజినపల్లి మండలంలో గెలుపొందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధులకు ఈనెల 10న సన్మానం చేయనున్నట్లు బీసీ సంఘం అధ్యక్షులు వేముల సత్యశిల సాగర్, మండల గౌరవ అధ్యక్షులు డి. వెంకటస్వామిలు తెలిపారు. మండల కేంద్రంలోని ఏం.జె.ఆర్ ఫంక్షన్ హాల్లో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు విధిగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి. చిరంజీవులు, డాక్టర్ విశారదన్ మహారాజ్, చెన్న శ్రీకాంత్, డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెబ్బేటి నిరంజన్ ముదిరాజ్, సుబ్బయ్య, సాయి మహారాజ్, రాజేందర్ గౌడ్, శివ, ఆంజనేయులు, సంతోష్ సాగర్, రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

