ఎస్.ఐ.ఆర్ అమలులో నిర్లక్ష్యం సహించేది లేదు
ప్రతి పోలింగ్ పక్కా అమలు జరగాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశాలు

జడ్చర్ల, జనవరి 8 (మనఊరు ప్రతినిధి): ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, విజయేంద్ర బోయి తెలిపారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఎస్.ఐ.ఆర్. అమలు తీరుపై గురువారం పట్టణంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ కళాభవన్‌లో బి.ఎల్.ఓ సూపర్ వైజర్లతో ఆయన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఒక్కో పోలింగ్ కేంద్రం వారిగా ఎస్.ఐ.ఆర్‌ను పరిశీలించి, పనితీరులో వెనుకంజలో ఉన్న బి.ఎల్.ఓ సూపర్‌వైజర్లను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలని, పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎస్.ఐ.ఆర్ అమలులో స్పష్టమైన ప్రగతి సాధించాల్సిందేనని కలెక్టర్. ప్రస్తుతం ఎస్.ఐ.ఆర్ సన్నాహక అమలులో జడ్చర్ల అర్బన్ సెగ్మెంట్ వెనుకంజలో ఉందని, ఈ పరిస్థితిలో వెంటనే మార్పు తీసుకురావాలని సూచించారు.


