ఎస్‌.ఐ.ఆర్‌ అమలులో అలసత్వం తగదు

 ఎస్‌.ఐ.ఆర్‌ అమలులో అలసత్వం తగదు

ప్రతి పోలింగ్‌ పకడ్బందీ అమలు చేయాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశాలు

జడ్చర్ల, జనవరి 8 (మనఊరు ప్రతినిధి): ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌.ఐ.ఆర్‌) సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్‌ స్టేషన్ పరిధిలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి స్పష్టం చేశారు.  జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఎస్.ఐ.ఆర్ అమలు తీరుపై గురువారం పట్టణంలోని బి.ఆర్.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాలలో బి.ఎల్.ఓ సూపర్‌వైజర్లతో ఆయన సమీక్షించారు. జరిగింది. ఈ సందర్భంగా ఒక్కో పోలింగ్ కేంద్రం వారిగా ఎస్‌.ఐ.ఆర్‌ను పరిశీలించి, పనితీరులో వెనుకంజలో ఉన్న బి.ఎల్.ఓ సూపర్‌వైజర్లను అడిగి తెలుసుకున్నారు.  ఎన్నికల సంఘం నియమ నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలని, పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎస్.ఐ.ఆర్ అమలులో స్పష్టమైన ప్రగతి సాధించాల్సిందేనని కలెక్టర్. ప్రస్తుతం ఎస్‌.ఐ.ఆర్‌ సన్నాహక అమలులో జడ్చర్ల అర్బన్ సెగ్మెంట్ వెనుకంజలో ఉందని, ఈ పరిస్థితిలో వెంటనే మార్పు తీసుకురావాలని సూచించారు.  ప్రతి పోలింగ్ కేంద్రం వారిగా బి.ఎల్.ఓలతో మ్యాపింగ్‌ను పక్కాగా నిర్వహించాలని, అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటర్ల జాబితా ఉండేలా నిశిత పరిశీలన జరపాలని.  ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, తహశీల్దార్ నర్సింహ రావు, సంబంధిత అధికారులు.




Previous Post Next Post