ల్యాబ్ టెక్నీషియన్ల నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

 ఆరోగ్య శాఖ ల్యాబ్ టెక్నీషియన్ల నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

నాగర్‌కర్నూల్, జనవరి 2 ,(మనఊరు ప్రతినిధి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ల 2026 సంవత్సరపు దినసరి క్యాలెండర్‌ను శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే. రవికుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ సంఘం అధ్యక్షులు పి. కళ్యాణ్ కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు నారాయణ, ఆంజనేయులు, సహాయ కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, సభ్యులు నాగరాజ్, శశికుమార్, శ్రావణ్ కుమార్, సత్తయ్య, హెల్త్ ఎడ్యుకేటర్స్ ఓ. శ్రీనివాసులు, రాజగోపాలాచారి, ఆకుతోట మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు.



Previous Post Next Post