శాంతినికేతన్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

 శాంతినికేతన్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

హరిదాసు వేషధారణలతో అలరించిన చిన్నారులు

నాగర్ కర్నూల్, జనవరి 9 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నగర్ కాలనీలో గల శాంతినికేతన్ పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక హరిదాసు వేషధారణలతో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల నిర్వాహకులు చిదిరే నరేష్ మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి సంక్రాంతి పండుగ విశిష్టత, సంప్రదాయాలు తెలియజేసే విధంగా వేషధారణలు, కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. చిన్నారులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాను ప్రకాష్, ఉపేందర్, వీణ, వినోద్, శ్వేత, నౌషాద్, తంజీల్‌తో పాటు పాఠశాల విద్యార్థులు, చిన్నారులు పాల్గొన్నారు.



Previous Post Next Post