అంగరంగ వైభవంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం

 భక్తుల మధ్య అంగరంగ వైభవంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం

కల్వకుర్తి రూరల్, జనవరి 25 (మనఊరు ప్రతినిధి): మండలంలోని ఎల్లికట్ట గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి కళ్యాణ కార్యక్రమం వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాకల సుమిత్ర భీమయ్య, ఉపసర్పంచ్ బలగం కేశవులు, వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు, యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ యాకల సుమిత్ర భీమయ్య, ఉపసర్పంచ్ బలగం కేశవులు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామ ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనందకరమని తెలిపారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా రాత్రి వేళల్లో స్వామివారి పల్లకీ సేవతో పాటు భజన కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు.





Previous Post Next Post