ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

ప్రజాస్వామ్యానికి ఓటు ఆయువుపట్టు

కల్వకుర్తి రూరల్, జనవరి 25 (మనఊరు ప్రతినిధి): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తహశీల్దార్ పురుషోత్తం పిలుపునిచ్చారు.శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవం-2026' పురస్కరించుకుని మండల మండలంలోని ఎల్లికట్ట ప్రథమిక పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ యువతతో నిర్భయంగా, కుల మత వర్గాలకు అతీతంగా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికల్లో ఓటు వేస్తామని అందరూ కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా అంగన్ వాడి టీచర్ జ్యోతి, బిఎల్వో మల్లారెడ్డిలు మాట్లడుతూ భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏటా ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2026 సంవత్సరానికి గాను “ఓటు కంటే మిన్న ఏదీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటు విలువను గుర్తించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కేశవులు, నాయకులు భిమయ్య, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. 

Previous Post Next Post