బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, తలకొండపల్లి, జనవరి 28 (మన ఊరు ప్రతినిధి): మండలంలోని అప్పన్న చెరువు పడకల్ గ్రామ శివారు నుంచి లింగరావుపల్లి వరకు నిర్మించనున్న 2 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రోడ్ల అభివృద్ధితో ప్రజల రాకపోకలు మరింత సులభమవుతాయని, గ్రామాల మధ్య అనుసంధానం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సునితా ప్రభాకర్ రెడ్డి, కాసు శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ కేశవరెడ్డి, రమాదేవి, జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
