ప్రమాదంలో గాయపడిన రాజును పరామర్శించిన ఎమ్మెల్యే కశిరెడ్డి
గాయపడిన వ్యక్తికి ఎమ్మెల్యే కశిరెడ్డి ఆర్థిక సాయం
తలకొండపల్లి, జనవరి 28 (మనఊరు ప్రతినిధి): మండలంలోని దేవుని పడకల్ సమీపంలోని అవేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రామకృష్ణపురం గ్రామానికి చెందిన పులికంటి రాజును ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం పరామర్శించారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన రాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5వేల నగదు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని విధాల సహాయాన్ని అందించేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


