భజన మండలిని అవమానిస్తే సహించం

 భజన మండలిని అవమానిస్తే సహించం

ఊరుకొండపేట ఆంజనేయస్వామి దేవాలయంలో భజన కమిటీ ఆవేదన

భజన మండలి కమిటీ అధ్యక్షులు జంగయ్య యాదవ్

కల్వకుర్తి, ఉరుకొండ, జనవరి 25 (మనఊరు ప్రతినిధి): మండలంలోని ఊరుకొండపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ఆంజనేయస్వామి భజన మండలి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భజన కార్యక్రమాల కోసం అవసరమైన తబలాలు, హార్మోనియం, తాళాలు, మైకులు తదితర సాంస్కృతిక సామగ్రిని దాతల సహకారంతో సమకూర్చినట్లు భజన మండలి కమిటీ అధ్యక్షులు జంగయ్య యాదవ్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ భజన కార్యక్రమాలు నిరంతరం కొనసాగితేనే దేవాలయానికి భక్తుల ఆదరణ పెరిగి అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందన్నారు. అలాంటి భజన మండలి కమిటీని, సభ్యులను దేవాలయ పాలక మండలి మరియు సంబంధిత అధికారులు కించపరచడం తగదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భజన మండలి సభ్యుల కృషిని గుర్తించకుండా అవమానకరంగా వ్యవహరిస్తే ఇకపై సహించేది లేదని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎండోమెంట్ శాఖ అధికారులు కూడా జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా భజన మండలి సభ్యుల సౌకర్యార్థం భజన మండలికి ప్రత్యేక విశ్రాంతి భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. భజన మండలిని లేదా కమిటీని అవమానపరిస్తే నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమని జంగయ్య యాదవ్ హెచ్చరించారు.

Previous Post Next Post