మార్చాలలో ఘనంగా లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు
కన్నులపండువగా రథోత్సవం
కల్వకుర్తి, జనవరి 25 (మనఊరు ప్రతినిధి): మండలంలోని మార్చాల గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారి రథోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
పవిత్రమైన రథంపై శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామిని అలంకరించి గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వందలాది మంది భక్తులు జయజయధ్వానాలు చేస్తూ రథాన్ని లాగగా, ప్రత్యేక పూజలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య రథోత్సవం కన్నులపండువగా సాగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
