తహసిల్దార్ మురళీమోహన్, గిర్దవర్ శేఖర్‌ల
ఉత్తమ సేవలకు జిల్లా స్థాయి అవార్డులు రావడం అభినందనీయం
సర్పంచ్ పురుగుల యాదయ్య
వంగూరు, జనవరి 27 (మనఊరు ప్రతినిధి): జిల్లా స్థాయి ఉత్తమ సేవా అవార్డులు అందుకున్న తాహసిల్దార్ మురళీమోహన్, గిర్దవర్ శేఖర్‌లను మంగళవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో సర్పంచ్ పురుగుల యాదయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మురళీమోహన్ మాట్లాడుతూ ప్రజలకు నిస్వార్థంగా, బాధ్యతాయుతంగా సేవలు అందించినప్పుడే ఇలాంటి గుర్తింపు లభిస్తుందని అన్నారు. జిల్లా స్థాయి అవార్డు రావడం తనతో పాటు కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అందరి కృషికి దక్కిన గౌరవమని తెలిపారు. గిర్దవర్ శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించడమే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నామని, భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండపల్లి భాస్కర్, వార్డు సభ్యులు లట్టుపల్లి మురళి, బండపల్లి శివకుమార్, సుమన్, రాజు, యూసుఫ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
