నాలుగు లక్షల విరాళంతో తేరు షెడ్డుకు శ్రీకారం

 నాలుగు లక్షలతో రథం(తేరు)కు షెడ్డు ఏర్పాటు చేసిన సుధా రెడ్డి...

మార్చాలలో సుధా రెడ్డి సేవకు ఆలయ కమిటీ, మహిళల ఘన సన్మానం

కల్వకుర్తి, జనవరి 27 (మనఊరు ప్రతినిధి): మండలంలోని మార్చాల గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణలో తేరు (రథం) నిల్వ చేసేందుకు షెడ్డును నిర్మిస్తున్నారు. ఈ షెడ్డును మార్చాల మాజీ సర్పంచ్ దేశం అల్వాల్ రెడ్డి కుమార్తె శ్రీమతి సుధా రెడ్డి స్వయంగా రూ.4 లక్షల విరాళంతో ఏర్పాటు చేయడం విశేషం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అభివృద్ధికి విశేషంగా సహకరించినందుకు సుధా రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ మహిళలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి సుధా రెడ్డి అందించిన సేవలు ఆదర్శప్రాయమని ప్రశంసించారు. భక్తుల సౌకర్యార్థం తేరు రథం సంరక్షణకు ఈ షెడ్డుతో ఎంతో ఉపయోగం చేకూరుతుందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఇలానే ప్రజలు ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post