మహిళల ఆర్థిక స్వావలంబనకే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

 మహిళల ఆర్థిక స్వావలంబనకే కాంగ్రెస్ ప్రభుత్వ  లక్ష్యం

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, జనవరి 18 (మనఊరు ప్రతినిధి): మహిళలు ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణంలోని కేబీఎన్ ఫంక్షన్ హాల్‌లో ఇందిరా సంబరాల కార్యక్రమంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ మహమూద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని, వడ్డీ లేని రుణాలతో మహిళలు స్వయం ఉపాధి సాధించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు వెయ్యి బస్సులను ప్రభుత్వం అందించిందని, ప్రతి బస్సుకు నెలకు రూ.65 వేల చొప్పున ఆర్టీసీ చెల్లిస్తోందని తెలిపారు. ఈ వడ్డీల ప్రభుత్వమే భారిస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తోందన్నారు. ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని, మహిళా సంఘాలు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. భూమి ఉన్న మహిళలు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని ఆదాయం పొందాలని సూచించారు. అలాగే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకునేందుకు కూడా మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. బీద కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని, ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు సుఖసంతోషాలతో ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందుకే కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ పదవిని మహిళకు కేటాయించారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇటీవల రూ.15 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కల్వకుర్తి ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందని ఎమ్మెల్యే. పాలమూరు జిల్లా14 నియోజకవర్గాల్లో 13 చోట్ల పడకల ఆసుపత్రులు ప్రారంభమయ్యాయని, కల్వకుర్తిలో ఆలస్యం కావడం గత పాలకుల వైఫల్యమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కల్వకుర్తి పట్టణ అభివృద్ధికి దాదాపు రూ.70 కోట్లు ఖర్చు చేసింది. వంద పడకల ఆసుపత్రి పనులు, సమస్యలేని పట్టణంగా తీర్చిదిద్దాలంటే మరో రూ.100 కోట్ల నిధులు అవసరమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారని, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రికి బహుమతిగా అందించాలని ఎమ్మెల్యే సమర్పించారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.కోటి ఆరు లక్షల విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అదేవిధంగా 15 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రాసీడింగులను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ మహమూద్, నాయకులు బృంగి ఆనంద్ కుమార్, చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి, కాయితి విజయ్ కుమార్ రెడ్డి, మిరియాల శ్రీనివాస్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, ఏజాస్, చిగుళ్లపల్లి సతీష్ కుమార్, గోరేటి శ్రీను, హనుమ నాయక్, మసూద్, జమ్మల శ్రీకాంత్, పర్షపాకుల శేఖర్, డామోదర్ గౌడ్, వర్కాల భాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాహుల్, రవిగౌడ్, చిత్తారి శ్రీను, బాల్ రెడ్డి, మైనార్టీ నాయకురాలు రేష్మా బేగం, రెహనా బేగం, మైబుదా, అంజలి, మున్సిపల్ సిబ్బంది, మహిళలు జరిగింది.



Previous Post Next Post