మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు పూర్తి
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణకు గ్రామస్తుల కృతజ్ఞతలు
జడ్చర్ల రూరల్, జనవరి 19 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని బోయిలకుంట గ్రామంలో గత కొంతకాలంగా నెలకొన్న మిషన్ భగీరథ పైప్‌లైన్ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. పైప్‌లైన్ మరమ్మతుల సమస్యను చర్లపల్లి సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జిల్లా కలెక్టర్‌తో చర్చించి, డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి బోయిలకుంట గ్రామానికి రూ.2 లక్షలు మంజూరు చేయించారు. ఆ నిధులతో సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతులు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో త్రాగునీటి సమస్య తొలగిపోవడంతో బోయిలకుంట గ్రామ ప్రజలు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి, సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, వార్డ్ మెంబర్ శ్రావణి, శ్రీశైలం, అనిల్ గౌడ్, రవి, ఇమ్రాన్, ఆంజనేయులు, శివయ్య, పరశురాములు, అజయ్ డి, అఖిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

