జాతీయ స్థాయి అవార్డుతో జడ్చర్లకు గర్వకారణం

 జాతీయ అవార్డుతో జడ్చర్లకు గర్వకారణం

ఆర్యవైశ్య లైమ్ లైట్ మోస్ట్ పాపులర్ అవార్డు గ్రహీత పద్మలీలకు ఘన సన్మానం

జడ్చర్ల, జనవరి 18 (మన ఊరు ప్రతినిధి): జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ఆర్యవైశ్య లైమ్ లైట్ మోస్ట్ పాపులర్ అవార్డును జడ్చర్ల జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు పద్మలీల గెలుచుకోవడం జడ్చర్లకు గర్వకారణమని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జడ్చర్లలో జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో పద్మలీలకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఉమ్మెత్తల మహేశ్వర్, భూమా నంద స్వామి, బాద్మి శివకుమార్, బుచ్చలింగం, విశ్వనాథం, రమణాచార్యులు, హలీం, జయప్రకాష్, రాధాకృష్ణ, బాబు నాయుడు, రత్న శేఖర్, నాగరాజ్, కిరణ్ మై, శ్రీను, రామకృష్ణ, నరేష్ తదితర ప్రముఖులు హాజరై పద్మలీలను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని పద్మలీలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ అవార్డు సాధించడం ద్వారా జడ్చర్ల పేరు దేశవ్యాప్తంగా వినిపించిందని పలువురు వక్తలు అన్నారు. సాహిత్య రంగంలో పద్మలీల చేసిన సేవలు అభినందనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.





Previous Post Next Post