ప్రతి నెలా ఒకరోజు రోగి సహాయకులకు అన్నప్రసాదం

 ప్రతి నెలా ఒకరోజు రోగి సహాయకులకు అన్నప్రసాదం

నాగర్ కర్నూల్ పూజారి బూర్గుల నరసింహారావు సేవాతత్పరత

నాగర్ కర్నూల్, (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన పూజారి బూర్గుల నరసింహారావు సేవాభావం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆయన ప్రతి నెలలో కనీసం ఒకరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి సహాయకులకు అన్నప్రసాద పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. 2014 సంవత్సరం నుంచి నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దత్త జయంతి, కార్తీక పౌర్ణమి, అమావాస్య, పౌర్ణమి వంటి ప్రత్యేక పర్వదినాలలో తప్పనిసరిగా నెలలో ఏదైనా ఒకరోజు సుమారు 150 మంది రోగి సహాయకులకు అన్నప్రసాదంతో పాటు స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా మౌని అమావాస్య పురస్కరించుకొని ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో నందకిషోర్, మహతి, అరుణ, సాయి ప్రకాష్, లక్ష్మణ్, యాదగిరి, బాలయ్య, తులసి శర్మ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం రోగి సహాయకులకు ఎంతో ఊరటనిచ్చేలా ఉందని పలువురు ప్రశంసించారు.





Previous Post Next Post