వైద్యశాఖ మినిస్ట్రియల్ ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక....
జిల్లా మినిస్టీరియల్ ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
అధ్యక్షుడిగా సుదర్శన్, కార్యదర్శిగా విజేందర్
నాగర్ కర్నూల్, జనవరి 9 (మనఊరు ప్రతినిధి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా కార్యాలయం, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కార్యాలయాలలో పనిచేస్తున్న మినిస్టీరియల్ సిబ్బంది కోసం ఏర్పాటైన మినిస్టీరియల్ ఫోరం జిల్లా కమిటీని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మినిస్టీరియల్ ఫోరం జిల్లా అధ్యక్షుడిగా సుదర్శన్, కార్యదర్శిగా విజేందర్, కోశాధికారిగా నదీమ్ సల్మాన్, అసోసియేట్ అధ్యక్షుడిగా భరత్ కుమార్ను నియమించారు. ఉపాధ్యక్షులుగా బుచ్చయ్య, హరికృష్ణ, వెంకటేశ్వర రెడ్డి, మహిళా ఉపాధ్యక్షులుగా అవనిజ, పార్వతమ్మలను ఎన్నుకున్నారు. అలాగే ఉప కార్యదర్శులుగా వెంకటేష్, జ్ఞానేశ్వర్, అన్వర్ బేగం, ప్రియాంక, నిర్వహణ కమిటీ కార్యదర్శిగా నాగయ్య, సాంస్కృతిక కార్యదర్శిగా చెన్న కేశవ్, జిల్లా అడక్ కమిటీ సభ్యుడిగా పి. కృష్ణయ్య తదితరులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సుదర్శన్ మాట్లాడుతూ, మినిస్టీరియల్ ఫోరం ద్వారా రానున్న రెండు సంవత్సరాల పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
