ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
డిప్యూటీ సూపరింటెండెంట్ డా. వి. శేఖర్
నాగర్‌కర్నూలు, జనవరి 1 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 2026 నూతన సంవత్సర వేడుకలను వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఘనంగా నిర్వహించినట్లు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి. శేఖర్ తెలిపారు. ఆసుపత్రి కార్యాలయ ఆవరణలో అన్ని విభాగాల వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ, కొత్త సంవత్సరంలో ఈ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలని కోరారు. రోగుల ఆరోగ్యం కాపాడటంలో వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది సమిష్టిగా సహకరించి సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ నరహరి, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ. రోహిత్, ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


