ఆకారపు శివాలయంలో శివదీక్ష స్వాములకు మడితో అన్నదానం
నాగర్ కర్నూల్, జనవరి 25 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో గల ఆకారపు శివాలయంలో రథసప్తమి ఆదివారం సందర్భంగా శివదీక్ష స్వాములకు మడితో కూడిన అన్నప్రసాదాన్ని ఆకారపు వంశీయులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆకారపు వంశీయులు మాట్లాడుతూ, మహాశివరాత్రి పర్వదినం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం వేళ శివదీక్ష గురు స్వామి వండిన మడితో కూడిన అన్నప్రసాదాన్ని శివదీక్ష స్వాములకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా శివభక్తులకు సేవ చేయడం తమ అదృష్టమని పేర్కొన్నారు. ఈ అన్నప్రసాద పంపిణీ కార్యక్రమంలో ఆకారపు శంకరయ్య, విశ్రాంత ఉపాధ్యాయుడు బి. వేణుగోపాల్, రామస్వామి, సాయిరాం, ఆకారపు స్వప్న, గిరి, గౌడ్, శివ స్వాములు తదితరులు పాల్గొన్నారు.

