సెర్ప్ ఉద్యోగుల యూనియన్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
నాగర్ కర్నూల్, జనవరి 25 (మనఊరు ప్రతినిధి): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఎల్1, ఎల్2 ఉద్యోగుల యూనియన్ నాగర్ కర్నూల్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో చారకొండ మండల మహిళా సమాఖ్య సీసీ ఎస్.కే. జరీనాను జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నుకోగా, జిల్లా ఉపాధ్యక్షులుగా డీఎంజీ శ్యామ్ సుందర్, బల్మూర్ మండల సమాఖ్య సీసీ జైహింద్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా నాగర్ కర్నూల్ క్లస్టర్ కోఆర్డినేటర్ కే. రాములు, సహాయ కార్యదర్శిగా ఊర్కొండ సీసీ ఏ. రామస్వామి, కోశాధికారిగా తెలకపల్లి మండల సమాఖ్య సీసీ నర్సింహా ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన సలహాదారులుగా డీపీఎం ఆలూరి చెన్నయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ఆలూరి చెన్నయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి యూనియన్ కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.


