తర్నికల్ యువకుడికి పీహెచ్డీ పట్టా
గ్రామానికి గర్వకారణం
కల్వకుర్తి రూరల్, జనవరి 8 (మనఊరు ప్రతినిధి): మండలంలోని తర్నికల్ గ్రామానికి చెందిన ఎలుక రామకృష్ణ గౌడ్ హైదరాబాదులోని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి నుంచి ఆర్గానిక్ పరమాణువు కెమిస్ట్రీ అంశంపై పరిశోధన పూర్తి చేసి పీహెచ్డీ పట్టా పొందారు. పేద కుటుంబ నేపథ్యంతో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ కఠిన శ్రమతో ఉన్నత చదువులో పీహెచ్డీ స్థాయికి చేరుకోవడం గ్రామానికి గర్వకారణమని గ్రామస్థులు తెలిపారు. రామకృష్ణ గౌడ్ సాధించిన విజయంపై బంధువులు, గ్రామ పెద్దలు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన విజయం నేటి యువతకు ఆదర్శమని పలువురు అభిప్రాయపడ్డారు.
