ఉడిత్యాల పంచాయతీ నూతన ప్రజాప్రతినిధులకు పాఠశాల సిబ్బంది ఘన సన్మానం

 ఉడిత్యాల పంచాయతీ నూతన ప్రజాప్రతినిధులకు పాఠశాల సిబ్బంది ఘన సన్మానం

బాలానగర్, జనవరి 8 (మనఊరు ప్రతినిధి): ఇటీవల జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఉడిత్యాల గ్రామ పంచాయతీలో ఘన విజయం సాధించిన సర్పంచ్ సక్కరి శ్రీధర్ గౌడ్, ఉపసర్పంచ్ మల్లేష్ గారిని ఉడిత్యాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు, పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు విద్యారంగ పురోగతికి నూతన పాలకవర్గం కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉడిత్యాల వార్డు సభ్యులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు తదితరులు పాల్గొని నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో పాఠశాల–పంచాయతీ సమన్వయంతో ముందుకు సాగుతామని నూతన పాలకవర్గం ఈ సందర్భంగా హామీ ఇచ్చింది.

Previous Post Next Post