భక్తి కార్యక్రమాలకు హాజరుకానున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

ఊర్కొండ, వెల్దండ మండలాల్లో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పర్యటన

భక్తి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్


కల్వకుర్తి, జనవరి 22 (మనఊరు ప్రతినిధి):
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ శ్రీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు శుక్రవారం కల్వకుర్తి నియోజకవర్గంలో వివిధ మండలాల్లో నిర్వహించనున్న భక్తి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఊర్కొండ వారు ఊర్కొండపేటలో వెలసిన శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు వెల్దండ మండలం బైపూర్ గ్రామంలో సైదులు దేవుని దర్గా గంధోత్సవానికి హాజరైన భక్తులతో కలసి ప్రార్థనల్లో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమాలకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఐక్యత సంస్థ ఒక ప్రకటనలో కోరింది.
Previous Post Next Post