ఎస్‌టీయూ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
అచ్చంపేట, జనవరి 1 (మనఊరు ప్రతినిధి): ఎస్‌టీయూ (స్టేట్ టీచర్స్ యూనియన్) డైరీ, క్యాలెండర్‌ను గురువారం అచ్చంపేట మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, ఎస్‌టీయూ రాష్ట్ర సహాధ్యక్షులు హన్మంత్ రెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లా అధ్యక్షులు కొత్త శ్రీధర్ రావుతో కలిసి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గంగాపురం రాజేందర్ కార్యాలయంలో డైరీ, క్యాలెండర్‌తో పాటు అనుబంధ పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళి, ఎస్‌టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు. అలాగే జిల్లా కౌన్సిలర్లు అర్జునయ్య, విక్రమ్, అచ్చంపేట ఎస్‌టీయూ అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ గౌడ్, భాస్కర్, నాయకులు సింగోటం, కె. పాండు, రవీందర్, నరేందర్ రెడ్డి, బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్‌టీయూ డైరీ, క్యాలెండర్ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉండేలా రూపొందించామని, విద్యా రంగానికి సంబంధించిన సమాచారంతో పాటు ప్రభుత్వ నిబంధనలు, ఉపాధ్యాయుల హక్కులు ఇందులో పొందుపరిచినట్లు తెలిపారు.

