వనపర్తి అభివృద్ధికి సీఎం పూర్తి సహకారం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
హైదరాబాద్, వనపర్తి జనవరి 2 (మనఊరు ప్రతినిధి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గంలో చేపడుతున్న, భవిష్యత్తులో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సీఎంతో విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదించిన పనులన్నింటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. వనపర్తి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక వసతులు, అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సీఎం రేవంత్‌రెడ్డి అందిస్తున్న సహకారానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
