10వ వార్డులో మున్సిపల్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్
మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, కమిషనర్ లక్ష్మా రెడ్డి పరిశీలన
జడ్చర్ల, రూరల్, జనవరి 2 (మనఊరు ప్రతినిధి): మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో శుక్రవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేయబడింది జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, కమిషనర్ లక్ష్మా రెడ్డి పాల్గొని పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. 1వ వార్డులోని వివిధ కాలనీల్లో మున్సిపల్ కార్మికుల రోడ్లు, డ్రైనేజీలను శుభ్రపరిచారు. పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రంగా మార్చారు. అలాగే ఒక వెంచర్‌లో కేటాయించిన 10 శాతం ప్రభుత్వ స్థలానికి హద్దులు ఏర్పాటు చేసి, ఆక్రమణల తొలగింపుతో పాటు శుభ్రపరిచే చర్యలు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ లక్ష్మా రెడ్డి వార్డు ప్రజలతో మాట్లాడి పారిశుధ్యం, డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాజు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ నరేశ్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.


