1800 మంది శివ స్వాములకు అన్నప్రసాద పంపిణీ

 1800 మంది శివ స్వాములకు అన్నప్రసాద పంపిణీ


నాగర్ కర్నూలు, ఫిబ్రవరి 23 (మనఊరు న్యూస్): జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కు చెందిన శ్రీ లలితా సహస్ర నామ సేవా సమితి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పురస్కరించుకొని శివదీక్ష స్వీకరించారు శివ స్వాములకు అదివారం నాడు హౌసింగ్ బోర్డ్ బస్ స్టాప్ ఎదురుగా ఓం నగర్ కాలనీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో సమితి అధ్యక్షురాలు కొత్త రేవతి కమిటీ సభ్యులతో ప్రత్యేక పూజలు జరిగాయి.అనంతరం వివిధ ప్రాంతాల నుండి కాలినడకన, శ్రీశైలం వెళ్తున్న ఈ ప్రాంతంలోని శివదీక్ష స్వీకరించిన స్వాములకు 1800 మంది స్వాములకు మడి తోకూడిన అన్నప్రసాదాన్ని ,పండ్లు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు.ఈనెల 25 తేదీ వరకు ప్రతిరోజు ప్రథమ ఫలదానము,అన్న ప్రసాదం,అల్పాహారము, చికిత్స సేవలు,నీటి వసతి ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేకంగా శివ స్వాములకు మడితో కూడిన అన్న ప్రసాదాన్ని పంపిణీ చేసారు. కమిటీసభ్యులు రాధారాణి, సుజాత ,నిర్మల, పద్మ, కృష్ణవేణి,  బలిశ్వరి, సరిత, వెంకటసుబ్బమ్మ, నాగమణి, పుష్పా, అనసూయమ్మ, మాధవి, సునీత, వజ్రమ్మ, సంపూర్ణ, అపర్ణ, సుచిత్ర, శివదీక్ష స్వాములు జరుగుతాయి.

Post a Comment

Previous Post Next Post