నవజాత శిశువుల యూనిట్ ను తనిఖీ చేసిన జిల్లా టీకాల అధికారి..
అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని నవజాత శిశువుల ప్రత్యేక యూనిట్ ను జిల్లా టీకాల అధికారి డాక్టర్ కే రవికుమార్ నాయక్ బుధవారం నాడు ఆకస్మిక తనిఖీ చేశారు.శిశువులకు అందిస్తున్న ఆరోగ్య సేవలపై ప్రత్యేక ఆరోగ్య సేవలను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బందిని పలు ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు మెరుగైన సేవలు ప్రతిరోగికి అందించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా టీకాల స్టోర్ మేనేజర్ డి.కుమార్, ఆరోగ్య కార్యకర్తలు యాదగిరి అబ్దుల్ సలీం తదితరులు పాల్గొన్నారు.